Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాండ్ బ్యాగులు తనిఖీ చేస్తే విమానాల్లో హైజాకింగ్ ఆగిపోతుందా? మంత్రి ఎకసెక్కెం

భవిష్యత్తులో ఎలాంటి విమాన హైజాకింగ్ ఘటనలు జరగకూడదంటే మహిళలు వాడే హ్యాండ్ బ్యాగ్‌లను విమానాశ్రయాల్లో తనిఖీ చేసి భద్రతాపరమైన స్టాంప్ వేయాలంటూ కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ సీఐఎస్ఎఫ్ మొండి పట్టు పట్టడంపై సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (06:17 IST)
భవిష్యత్తులో ఎలాంటి విమాన హైజాకింగ్ ఘటనలు జరగకూడదంటే మహిళలు వాడే హ్యాండ్ బ్యాగ్‌లను విమానాశ్రయాల్లో తనిఖీ చేసి భద్రతాపరమైన స్టాంప్ వేయాలంటూ కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ సీఐఎస్ఎఫ్ మొండి పట్టు పట్టడంపై సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్జారు. హ్యాండ్ బ్యాగులు తనిఖీ చేస్తారా. ఆ పనెందుకు.. అసలు విమానాశ్రయంలోకి ఎవరికీ పంపకుండా ఉంటే.. హైజాక్‌కి అవకాశమే ఉండదు కదా.. అని చురకలు అంటించారు మంత్రి.
 
విమానాశ్రయాల్లో భద్రత మరింతగా పెంచాలంటే అమలుకు వీలుకాని రక్షణ చర్యలు చేపట్టడం అని కాదన్ని మంత్రి హితవు చెప్పారు. ‘‘భద్రతాచర్యలు ఆటంకాలు లేకుండా.. అర్థవంతంగా ఉండాలి. అలా కాకుండా.. ఎవరినీ అనుమతించకుంటే ఇక ఏ సమస్యా ఉండదు. అలాగే.. విమానాలకూ పని ఉండదు..’’ అని వ్యాఖ్యానించారు. సీఐఎస్‌ఎఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌ అని.. పౌరవిమానయాన రక్షణ విభాగం నిర్దేశించిన ప్రమాణాలను అది పాటించాలని చెప్పారు. 
 
పౌర విమానయాన మంత్రి నేరుగా విమానాశ్రయాలను కాపలాకాస్తున్న సీఐఎస్ఎఫ్‌పైనే సెటైర్లు వేయడం షాక్ తెప్పించింది. ఏమో భవిష్యత్తులో హ్యాండ్ బ్యాగులే పేలుడు సామగ్రికి నిలయాలుగా మారతాయేమో ఎవరు చెప్పగలరు?
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments