Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీ సర్టిఫికేట్ల తనిఖీకీ సీఐసీ ఆదేశం.. మంత్రి పదవి ఊడుతుందా?

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత సర్టిఫికేట్లపై జరుగుతున్న దుమారం అంతాఇంతా కాదు. ఇదే అంశంపై పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా.. డిగ్రీ కూడా లేదని ఓ మహిళకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శా

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (06:31 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత సర్టిఫికేట్లపై జరుగుతున్న దుమారం అంతాఇంతా కాదు. ఇదే అంశంపై పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా.. డిగ్రీ కూడా లేదని ఓ మహిళకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖను కట్టబెట్టారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు కూడా చేలరేగాయి. 
 
ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీకి సంబంధించిన 10, 12వ తరగతుల రికార్డుల తనిఖీకి అనుమతించాలని సీబీఎస్‌ఈని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఆదేశించింది. ఆ రికార్డులు వ్యక్తిగత సమాచారం కిందికి వస్తాయన్న సీబీఎస్‌ఈ వాదనను తోసిపుచ్చింది. 
 
స్మృతి రికార్డుల తనిఖీ కోసం ఆర్టీఐ దరఖాస్తుదారుడికి 60 రోజుల్లోపు అనుమతించాలని, అడ్మిట్‌కార్డు, మార్కుల లిస్టుల్లోని ఇంటి అడ్రస్‌ వంటి వ్యక్తిగత సమాచారం మినహా ఇతర సమాచారాన్ని అందివ్వాలని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు ఆదేశించారు. 
 
తనిఖీకి వీలుగా స్మృతి ఇరానీ రోల్‌ నంబర్, లేదా రిఫరెన్స్‌ నంబర్‌ను 1991-93నాటి రికార్డులున్న సీబీఎస్‌ఈ (అజ్మీర్‌)కు ఇవ్వాలని జౌళి శాఖను, ఇరానీ ఉత్తీర్ణులైనట్లు చెబుతున్న ఢిల్లీలోని హోలీచైల్డ్‌ స్కూల్‌ను సీఐసీ ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments