నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (12:48 IST)
కేరళ రాష్ట్రంలోని కాసర్‌కోడ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రీయూనియన్ పేరుతో 50 యేళ్ల తర్వాత సమావేశమైన స్నేహితులు కొట్టుకున్నారు. నాలుగో తరగతిలో జరిగిన ఓ గొడవను గుర్తుకు తెచ్చుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ బాల్యపు గొడవకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
 
కాసర్‌కోడ్‌ జిల్లాలో 50 యేళ్ల తర్వాత రీయూనియన్ పేరుతో ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. వీరికి ప్రస్తుతం 62 యేళ్ళు. ఈ ముగ్గురు మిత్రుల పేర్లు బాలకృష్ణన్, వీజే బాబు, మాథ్యూ. వీరిలో బాలకృష్ణన్, వీజే బాబులు కాసర‌కోడ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. 
 
నాలుగో తరగతిలో ఉన్నపుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగి బాలకృష్ణన్‌ను వీజే బాబు కొట్టారు. ఇది దాదాపు 1970లో జరిగింది. బాలకృష్ణన్ ఇటీవల తన స్నేహితుడైన మాథ్యూతో కలిసి బయటకు వెళ్ళగా, అక్కడ అనుకోకుండా వీజే బాబు కలిశారు. 
 
చిన్ననాడు వీజే బాబు తనను కొట్టాడనే విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలకృష్ణన్ మాటల మధ్యలో నాలుగు తరగతి నన్ను ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి బాబుబై దాడి చేశాడు. మాథ్యూ కూడా ఓ చేయి వేయడంతో గాయాలపాలైన వీజే బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుపోయిన పోలీసులు బాబును కున్నూరు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణన్, మాథ్యూను పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments