Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకూ పిల్లల సంరక్షణ సెలవులు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:32 IST)
పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు స్త్రీలకే కాదు ఇకపై పురుషుల కూడా సెలవులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే సింగిల్‌ పెరేంట్స్‌గా ఉన్న పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తించనుంది.

అలాగే, అవివాహితుడు లేదా భార్య చనిపోయిన లేదా విడాకులు పొందిన మగ ఉద్యోగులకూ ఈ సెలవు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి కొంత కాలం క్రితమే ఉత్తర్వులు జారీ చేశామని, అయితే ఇంకా దీనిపై సరైన అవగాహన రాలేదని చెప్పారు.

ఇప్పుడు మరింత సడలింపుల్లో భాగంగా.. పిల్లల సంరక్షణలో ఉంటున్న తండ్రి... ముందస్తు అనుమతితో సెలవులు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అదనంగా సెలవు ప్రయాణ రాయితీని (ఎల్‌టిసి) కూడా పొందవచ్చునని తెలిపారు.

పిల్లల సంరక్షణ సెలవులు తొలి 365 రోజులకు గానూ 100 శాతం జీతం చెల్లించనున్నారు. తదుపరి సంవత్సరానికి 80 శాతం జీతం చెల్లించనున్నట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

విభిన్న ప్రతిభావంతుల కలిగిన సింగిల్‌ పేరెంట్‌ అయితే.. గతంలో ఉన్న 22 సంరక్షణ బాధ్యతలను తొలగించి.... ఇప్పుడు ఎప్పుడైనా సెలవులు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments