Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్‌ దారుణ హత్య-నీటిలోనే మృతదేహం వుండాలని రాయికి కట్టేశారు..

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (18:31 IST)
ప్రముఖ మోడల్ మృతదేహం జార్ఖండ్‌లోని బాలోద్ గ్రామంలో మంగళవారం కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కాలువలో మృతదేహం చేతులు, కాళ్లు తాడుతో కట్టివేసి ఉండటాన్ని గమనించారు. ప్రాథమిక విచారణలో కడుపు భాగంలో కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.  
 
మహిళను చంపేసి నీటిలో మునిగి ఉండాలని ఓ రాయిని కట్టి నీటీలో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా శవం చేతిపై ఉన్న టాటూ సాయంతో ఆమెను గుర్తించారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోను ప్రచారం చేయడంతో తల్లిదండ్రులకు సమాచారం అందింది. ధంతరీ జిల్లాలో ఉంటున్న ఆంచల్ యాదవ్(32) పేరెంట్స్ తమ కూతురిదేనని నిర్ధారించారు. కొన్నేళ్లుగా జార్ఖండ్‌లోని రాంచీ ప్రాంతంలో మోడల్‌గా పని చేస్తుందని తెలిపారు.
 
సోమవారం రాత్రి 9గంటల సమయంలో తమ ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడని.. ఆమె అరగంటలో తిరిగొస్తానని అతనితో పాటు వెళ్లిందని మృతురాలి తల్లి తెలిపింది. తనకు బాగా తెలిసిన వారే హత్యకు పాల్పడి ఉంటారని ఆంచల్ యాదవ్ అంటున్నారు. అయితే పోలీసులు సోషల్ మీడియా అకౌంట్లు, కాల్ రికార్డ్స్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. 
 
ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. యాదవ్ ఓ వివాదస్పద వీడియో క్లిప్ చూపించి బర్నవపర ఫారెస్ట్ ఆఫీసర్‌ను వేధిస్తున్నందుకు గానూ 2014లో అరెస్టు అయింది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నప్పుడు ఆఫీసర్‌ను కలిసినట్లు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం తర్వాత ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని యాదవ్ ఆరోపించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం