Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. పిల్లలులేని ఓ వ్యక్తి మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను మింగడంతో అది కాస్త గొంతులో ఇరుక్కుని పోయింది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూరికి చెందిన ఆనంద్ యాదవ్‌కు వివాహమై చాలా ఏళ్లు అయినా సంతానం లేదు. దాంతో పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తాంత్రికుడిని సంప్రదించాడు.
 
అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలాడు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆనందన్‌ను అంబికాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు.
 
ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం వైద్యులకు షాకిచ్చింది. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆనంద్ యాదవ్ చనిపోయినట్లు వైద్యుడు సంతు బాగ్ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments