Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 4 చొప్పున లీటర్ గోమూత్రం కొనుగోలు.. ఛత్తీస్‌గఢ్ సిద్ధం

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:07 IST)
ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం లీటర్ గోమూత్రాన్ని రూ. 4 చొప్పున కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది.  గోధనర్ న్యాయ్ యోజన కింద ఈ గోమూత్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జూలై 28న స్థానికంగా నిర్వహించే హరేలీ పండుగ రోజున ఈ కార్యక్రమం చేపట్టనుంది.
 
గోధన్ న్యాయ్ యోజన కింద ఇప్పటికే గోవు పేడను కొనుగోలు చేస్తున్నారు. పశువుల పెంపకందారుల ఆదాయాలు పెంచడానికి, ఆర్గానిక్ రైతులు లబ్ది పొందేలా రెండేళ్ల క్రితమే ఆవు పేడను గోధన్ న్యాయ్ యోజన కింద కొనుగోలు చేస్తున్నారు.
 
గోమూత్రాన్ని తొలి దశలో ప్రతి జిల్లాలో రెండు ఎంపిక చేసిన సెల్ఫ్ సపోర్టింగ్ గోధన్‌ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
 
గోధన్ న్యాయ్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అయ్యాజ్ తంబోలి మాట్లాడుతూ, గోధన్‌లలో గోమూత్రాన్ని కొనుగోలు చేసు ప్రక్రియను కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
 
జిల్లాలో స్వతంత్ర ఇండిపెండెంట్ గోధన్‌లను గుర్తించే బాధ్యత కలెక్టర్లదేనని వివరించారు. ఈ విధానంలో కొనుగోలు చేసిన గోమూత్రాన్ని పురుగులు, చెద నివారణ మందుల కోసం ఉపయోగిస్తారని తంబోలి వివరించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments