డ్యూటీకి వెళ్లనివ్వడంలేదని భార్యని చంపిన కానిస్టేబుల్‌

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:10 IST)
డ్యూటీ మీద ప్రేమో లేక పై ఆదాయం మీద ప్రేమో కానీ... ఎన్నికల విధులకు వెళ్లనివ్వడం లేదని ఓ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ భార్యను హత్య చేసేసాడు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 16వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ గురువీర్ సింగ్ జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తన భార్య అనుప్రియ గౌతమ్‌తో కలిసి నివసిస్తున్నాడు. కాగా, గురువీర్ సింగ్ ఈ నెల 17వ తేదీన ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. ఎన్నికల విధులకు వెళ్లొద్దంటూ భార్య ఈ నెల 16వ తేదీ రాత్రి గురువీర్‌తో గొడవ పడ్డారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని... అది కాస్తా పెరిగి... సదరు కానిస్టేబుల్ ఆవిడ గొంతు నులిమి చంపేసాడు. 
 
అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించగా... పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య అని తేలడంతో విచారణ చేపట్టిన పోలీసులకు అనుప్రియను తానే గొంతు నులిమి చంపినట్లుగా కానిస్టేబుల్‌ తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments