Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం, కూలర్, ఫ్రిజ్ కావాలన్నాడు.. పెళ్ళైన మర్నాడే భర్తను జైలుకు పంపేసింది..

కట్నం కావాలన్నాడు. ఎండలు మండిపోతుంటే.. పుట్టింటి నుంచి కూలర్ తెమ్మన్నాడు. ఐస్ వాటర్ తాగేందుకు ఫ్రిజ్ కావాలన్నాడు. అంతే.. తల వంచుకని తాళి కట్టించుకున్న నవ వధువు మరుసటి రోజో భర్తను జైలుకు పంపించింది. ఈ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (13:14 IST)
కట్నం కావాలన్నాడు. ఎండలు మండిపోతుంటే.. పుట్టింటి నుంచి కూలర్ తెమ్మన్నాడు. ఐస్ వాటర్ తాగేందుకు ఫ్రిజ్ కావాలన్నాడు. అంతే.. తల వంచుకని తాళి కట్టించుకున్న నవ వధువు మరుసటి రోజో భర్తను జైలుకు పంపించింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్‌లోని కోరియా జిల్లాలోచోటుచేసుకుంది. భర్త కట్నం అడగడంతో పుట్టింటికెళ్లి తల్లిదండ్రుల ముందు ఏడ్చుకోకుండా.. భర్తను జైలుకు పంపిన నవవధువు ధైర్యమైన నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే, కోరియా పట్టణానికి చెందిన యువతికి, సమీప గ్రామంలోని ఓ యువకుడికి సోమవారం నాడు వివాహమైంది. పెళ్లి సందర్భంగా ముందుగా అనుకున్న కట్న కానుకలన్నింటినీ వధువు కుటుంబం సమకూర్చింది. పెళ్లైన తర్వాతే వరుడిలోని మరో రూపం బయటపడింది. 
 
అదనపు కట్నంతో పాటు కూలర్, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పుట్టింటి నుంచి తెమ్మన్నాడు. ఇప్పట్లో అవన్నీ ఇవ్వలేమని పెద్దమనుషులతో చెప్పించినా వరుడు పట్టించుకోలేదు. కొన్ని గంటలపాటు వరుడి వాలకాన్ని చూసిన నవవధువు.. ఇక లాభం లేదనుకుంది. వరుడిని పోలీసులకు అప్పగించింది. కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తాళి కట్టిన రోజే కట్నకానుకలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేసింది. అంతే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments