Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డల కంటే ప్రియుడే ముఖ్యం... పాలలో విషం కలిపి కడతేర్చింది...

ఓ వివాహిత ప్రియుడి మోజులో పడింది. ఆమెకు కట్టుకున్న భర్త, ఇద్దరు కన్నబిడ్డల కంటే ప్రియుడే ఎక్కువ అనుకుంది. అందుకే తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి చంపేసింది. ఆ తర్వాత ప్రియుడితో పారిపోయింది. చెన్నైల

Chennai
Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (10:23 IST)
ఓ వివాహిత ప్రియుడి మోజులో పడింది. ఆమెకు కట్టుకున్న భర్త, ఇద్దరు కన్నబిడ్డల కంటే ప్రియుడే ఎక్కువ అనుకుంది. అందుకే తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి చంపేసింది. ఆ తర్వాత ప్రియుడితో పారిపోయింది. చెన్నైలోని కుండ్రత్తూరులో ఈ దారుణం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నగర శివారు ప్రాంతమైన కుండ్రత్తూర్‌కి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి విజయ్‌(34), అభిరామి(28) అనే దంపతులకు అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అభిరామికి అదే ప్రాంతంలో బిర్యానీ దుకాణంలో పని చేసే సుందరం అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇదికాస్త ప్రేమ, ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు గమనించి భర్తకు చేరవేశాడు. దీంతో విజయ్ భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. కాగా, ఆగస్టు నెలలో 31వ తేదీ చివరి రోజు కావడంతో శుక్రవారం బ్యాంక్‌లో పని అధికంగా ఉంటుందని, ఆలస్యంగా వస్తానని భార్యతో చెప్పి విజయ్‌ వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చిన అతడు... ఇంటి తలుపులు మూసివుండడం, ఇంట్లో లైట్లు వెలుగుతుండటంతో తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూసి దిగ్భ్రాంతి చెందాడు.
 
ఇద్దరు పిల్లలూ నురుగులు కక్కుకొని అచేతనంగా పడి ఉన్నారు. భోరున విలపిస్తూ... భార్య కోసం వెతకగా, ఆమె కనిపించకపోవడంతో కుండ్రత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియుడితో వెళ్లాలనుకున్న అభిరామి పాలలో విషం కలిపి పిల్లలకు ఇచ్చి హత్య చేసిందని విచారణలో పోలీసులు నిర్ధారించారు. 
 
ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. సుందరాన్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. పాలు తాగి బాధతో పిల్లలు కేకలు వేస్తుండగా సుందరం తన మోటార్‌బైక్‌పై అభిరామిని కోయంబేడు బస్టాండుకు తీసుకెళ్లి నాగర్‌కోయిల్‌ బస్సు ఎక్కించినట్టు విచారణలో వెల్లడించాడు. వాస్తవానికి రోజూలాగే ముందుగానే ఇంటికి వస్తే పిల్లలతోపాటు భర్తను కూడా చంపాలని అభిరామి నిర్ణయించుకుందని పోలీసులు గుర్తించారు. సుందరం ఇచ్చిన సమాచారంతో నాగర్‌కోయిల్‌లో తలదాచుకున్న అభిరామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments