Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్యా... చెన్నైకు ఈ యేడాది వరదలు రావట.. చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరం..

వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేశ్‌ తెలిపారు. సోమవారం అర్థరాత్రి తర్వాత గాలుల తీవ్రత, వర్షాలు తగ్గుతాయని వెల్లడ

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2016 (17:25 IST)
వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేశ్‌ తెలిపారు. సోమవారం అర్థరాత్రి తర్వాత గాలుల తీవ్రత, వర్షాలు తగ్గుతాయని వెల్లడించారు. గతంలోలా చెన్నైని వరదలు ముంచెత్తే అవకాశం లేదని స్పష్టంచేశారు.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్దా తుఫాను ప్రభావం తక్కువేనని తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నామని తెలిపారు. గతేడాది దాదాపు 15 రోజులు భారీ వర్షాలు కురవడంతో చెన్నై నగరం చాలా వరకు మునిగిపోయిన సంగతి తెలిసిందే.
 
కానీ, వర్దా తుఫాను తీరం దాటుతుండగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ అదరనపు డైరెక్టర్‌ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. చెన్నైలో గరిష్టంగా గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయని వెల్లడించారు. 
 
మరోవైపు.. 'వర్ద' తుపాను తీవ్రతతో చెన్నై నగరం అతలాకుతలమైంది. గంటకు 140కి.మీ. వేగంతో వీచిన గాలులకు భారీ చెట్లు నేలకొరిగాయి. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు రహదారులు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. 
 
నగరంలోని పలు చోట్ల అనేక చెట్లు నేలకూలగా, పెను గాలుల ధాటికి నగరంలోని పలుచోట్ల హోర్డింగ్‌లు, విద్యుత్‌ స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments