Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాలు.. నేరాలు.. చెన్నైదే అగ్రస్థానం..

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (13:24 IST)
వివాహేతర సంబంధాలతో జరిగిన నేరాల్లో చెన్నై అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని రెండు మిలియన్లకు పైగా జనాభా వున్న నగరాల్లో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ లెక్కలు చెపుతున్నాయి. 2019లో వివాదాల కారణంగా చెన్నైలో 90 హత్యకేసులు నమోదు అయ్యాయి. 2019 లో సీనియర్ సిటిజన్లను హత్య చేసిన కేసుల్లో తమిళనాడులో అత్యధిక కేసులు నమోదై రెండవ స్ధానంలో నిలిచింది.
 
గతేడాది అక్టోబర్‌లో 23 ఏళ్ల యువతి తన ప్రియుడితో వివహేతర సంబంధం కొనసాగించటానికి భర్తను హత్య చేసింది. హత్యనుకప్పిపుచ్చటానికి అతిగామద్యం సేవిచటం వల్ల మరణించాడని కట్టు కథలు అల్లింది. కానీ పోలీసు విచారణలో అన్ని విషయాలు వెలుగు చూసి ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల జరిగిన హత్యల్లో దేశంలోనే చెన్నై మొదటి స్థానంలో నిలిచింది.
 
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2019లో అక్రమ సంబంధాల కారణంగా చెన్నైలో 28 హత్యలు జరిగి మొదటి స్ధానంలో నిలిచింది. చెన్నైలో వివాదాలకు సంబంధించి 90 హత్య కేసులు నమోదయ్యాయి. వీటిలో చెన్నై రెండో స్ధానంలో ఉండగా ఢిల్లీ 125 కేసులతో మొదటిస్ధానంలో ఉంది. కుటుంబ వివాదాలపై 60 కేసులు, చిన్న చిన్న గొడవలు 34, వ్యక్తిగత శత్రుత్వం కేసుల్లో కూడా 52 కేసులతో చెన్నై మొదటి స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments