Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మరణం చేదు నిజం.. జీర్ణించుకోలేక 77 మంది కన్నుమూత.. ఆ రోజు అమ్మ క్యాంటీన్లు మాత్రం..?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (15:26 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 77 మంది మరణించారు. జయలలిత చనిపోయిందని తెలియగానే తమిళనాడులోని దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. 
 
విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కానీ ఒక్కచోట మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. తమ సేవలను కొనసాగించారు. అవే అమ్మ క్యాంటీన్లు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు 5రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి జయలలిత శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
 
జయలలిత చనిపోయిందన్న వార్త తెలియగానే అమ్మ క్యాంటీన్లను కూడా మూసేద్దామనుకున్నామని, కానీ ఆమె సంకల్పానికి తూట్లు పొడవడం ఇష్టం లేక ఆ తర్వాత కూడా క్యాంటీన్లను కొనసాగించామని నిర్వాహకులు తెలిపారు. అమ్మ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించేవారని, ఇలా ప్రజల ఆకలి తీరిస్తేనే ఆమె ఆత్మ శాంతిస్తుందనే ఉద్దేశంతోనే తమ సేవలు కొనసాగించినట్లు తెలిపారు. ఏదేమైనా వీరి ఉద్దేశం బాగుందని పలువురు అభినందిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments