Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్ నాటకం... జీడిమామిడి తోటలో నిప్పంటించాడు

ఓ కామాంధుడి ఆడిన నాటకానికి ఓ యువతి మోసపోయింది. ప్రేమ, పెళ్లి, శోభనం తర్వాత మనం కలిసివుండటం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టంలేదనీ నమ్మించిన ఆ కామాంధుడు... ఆత్మహత్యే శరణ్యమన్నాడు.

Webdunia
గురువారం, 6 జులై 2017 (09:21 IST)
ఓ కామాంధుడి ఆడిన నాటకానికి ఓ యువతి మోసపోయింది. ప్రేమ, పెళ్లి, శోభనం తర్వాత మనం కలిసివుండటం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టంలేదనీ నమ్మించిన ఆ కామాంధుడు... ఆత్మహత్యే శరణ్యమన్నాడు. ఇందుకు ఆ యువతి కూడా సమ్మతించింది. చివరకు ఆ యువతిని ఎవరూ లేని జీడిమామిడి తోటలోకి తీసుకెళ్లి అక్కడ కూడా చివరిసారిగా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత డీజిల్ పోసి నిప్పంటించాడో కిరాతకుడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై కొళత్తూరుకు చెందిన శక్తి (23) అనే యువతికి సేలంకు చెందిన మురళి అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో గత జూన్‌ 28న మురళి, శక్తిలు కలిసి తంజావూరుకు వెళ్లారు. అనంతరం బన్రుట్టికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని నాలుగు రోజుల పాటు కాపురం చేశాడు. 
 
పిమ్మట మురళి ఉన్నట్టుండి తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించటం లేదంటూ ఇక తమకు చావే శరణ్యమని శక్తిని నమ్మించాడు. దీనికి కూడా ఆమె సమ్మతం తెలిపింది. అయితే, ఇద్దరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుందామని అతడికి తెలిపింది. శక్తి షరతుకు మురళి సరేనన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బన్రుట్టిలోని జీడిమామిడి తోట వద్దకు వెళ్లారు. అక్కడ చివరిసారి ఏకాంతంగా ఉన్నారు. ఆ తర్వాత శక్తిపై మురళి డీజిల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. 
 
ఆసమయానికి అటుగా వస్తున్న 108 అంబులెన్స్ డ్రైవర్ ఒకరు మంటల్లో చిక్కుకున్న శక్తిని రక్షించి బన్రుట్టి ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న శక్తి... జరిగిన విషయాన్ని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మురళిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments