Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని పదిమంది యువతులకు వేధింపులు.. ఎఫ్‌బీలో ఫోటోలు.. చెన్నైలో..?

యువతిని లోబరుచుకోవాలనుకున్నాడు. కాదు పొమ్మంది. అంతే ఆమె ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:14 IST)
యువతిని లోబరుచుకోవాలనుకున్నాడు. కాదు పొమ్మంది. అంతే ఆమె ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. చెన్నై చిందాదిరిపేట్టైకి చెందిన పోలీస్ స్టేషన్‌లో అదే ప్రాంతానికి చెందిన మహిళ తన కుమార్తె ఓ యువకుడి చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె అర్ధనగ్న ఫోటోలు ఫేస్ బుక్‌లో శ్యాముయేల్ అనే యువకుడు పోస్ట్ చేసాడని ఫిర్యాదు చేసింది.
 
ప్రేమ పేరుతో తన బిడ్డను వేధించాడని తెలిపింది. ప్రేమించలేదనే కోపంతో తన కుమార్తె ఫోటోలను గ్రాఫిక్స్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడని ఆ తల్లి ఆరోపించింది. ఇదే తరహాలో అనేకమంది యువతులను బెదిరించాడని, అతనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఈ కేసులో శ్యాముయేల్ నిందితుడని కనుగొన్నారు. ఈ యువకుడు కళాశాల విద్యార్థులు 10 మందిని మోసం చేసినట్లు తెలిసింది. కానీ పరారీలో ఉన్న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments