Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలిపటం చెన్నై టెక్కీ గొంతు కోసింది... ప్రాణం తీసింది...

పొంగల్ అని తమిళనాడులో చెప్పుకునే పండుగ ముగిసిన దగ్గర్నుంచి ఆ రాష్ట్రంలోని పల్లెటూళ్లలో అక్కడక్కడ గాలిపటాలు ఎగురవేస్తూ సరదా చేస్తుంటారు. అసలు పండుగతో సంబంధం లేకుండా చాలామంది గాలి పటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గాలి పటాలను ఎగురవేసేందుకు బలమైన ద

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (15:26 IST)
పొంగల్ అని తమిళనాడులో చెప్పుకునే పండుగ ముగిసిన దగ్గర్నుంచి ఆ రాష్ట్రంలోని పల్లెటూళ్లలో అక్కడక్కడ గాలిపటాలు ఎగురవేస్తూ సరదా చేస్తుంటారు. అసలు పండుగతో సంబంధం లేకుండా చాలామంది గాలి పటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గాలి పటాలను ఎగురవేసేందుకు బలమైన దారాన్ని ఉపయోగిస్తారు. ఈ దారం గాజు తదితర పదార్థాలతో చాలా గట్టిగా తయారుచేస్తారు. గాజును ఎందుకు ఉపయోగిస్తారంటే తన గాలి పటానికి ఆకాశంలో మరెవరిదైనా అడ్డుపడితే దాన్ని తెగ్గోసేసి ఇది ఎగురుతుంది. ఐతే ఈ గాలిపటం సరదా చెన్నైలో 40 ఏళ్ల టెక్కీ ప్రాణం తీసింది.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై శివారులో ఉండే మదుర్‌వాయిల్ బైపాస్ పైన 40 ఏళ్ల శివప్రకాశం తన తండ్రిని బైకుపై ఎక్కించుకుని తాము కొనుగోలు చేసిన భూములను చూసి వస్తున్నారు. అలా వస్తున్న తరుణంలో అకస్మాత్తుగా శివప్రకాశం మెడకు తెగిన గాలి పటం దారం చుట్టుకుంది. వేగంగా వస్తున్న శివప్రకాశం ఆ దారాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది మెడకు గట్టిగా చుట్టేసింది. దాంతో అతడి గొంతు భాగం కోసుకుపోయింది. 
 
ఆ బాధను భరించలేని అతడు దాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే వున్న ఇనుప గేట్లకు బలంగా ఢీకున్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి తండ్రి చంద్రశేఖరన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. గాలి పటాలను ఎగురవేయడం చెన్నైలో నిషేధించారు. పదేళ్ల క్రితం ఓ బాలుడు గాలిపటం దారం గొంతుకు చుట్టుకుని మరణించడంతో అప్పటి నుంచి నిషేధాజ్ఞలు అమలులో వున్నాయి.

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments