Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ’ క్యాంటీన్లలో ధరల పెంపు... మౌనందాల్చిన ఓపీఎస్

నిరుపేదల కడుపు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మ క్యాంటీన్ల'లో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచనున్నారు. ఈ క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల ధరల వల్ల విపరీతమైన నష్టాలు వస్తు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:01 IST)
నిరుపేదల కడుపు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మ క్యాంటీన్ల'లో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచనున్నారు. ఈ క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల ధరల వల్ల విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను ఓ సాకుగా చూపి క్యాంటీన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచాలని నిర్ణయించింది. అంతేగాక ప్రస్తుతం అందిస్తున్న ఆహార పదార్థాలతో పాటు కాయగూరలు, నిత్యావసర వస్తువులను కూడా విక్రయిచాలని కార్పొరేషన్‌ భావిస్తోంది.
 
చెన్నై మహానగరంలో 2013లో అమ్మా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేశారు. జీసీఎంసీ పరిధిలో 407 అమ్మా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ కేవలం రూ.20లు చెల్లించి మూడు పూటలా కడుపునిండా ఆహారం తీసుకోవచ్చు. ఉదయం రూ.1కి ఒక ఇడ్లీ, రూ.3కు పొంగల్‌, మధ్యాహ్నం రూ.5కు సాంబారన్నం పులిహోర, రూ.3కు పెరుగన్నం, సాయంత్రం రూ.10కి మూడు చపాతీలను అందిస్తున్నారు.
 
పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులే కాకుండా విదేశీయులు కూడా ఈ పథకాన్ని స్వయంగా పరిశీలించి, అభినందించారు. ఇంతటి ఆదరణ పొందిన ఈ పథకం జయ మరణానంతరం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కుంటుపడుతోంది. ఈ క్యాంటీన్లలో అందించే ఆహారం రుచికరంగా ఉండటం లేదని, నాణ్యత లోపించిందన్న ఆరోపణలు కూడా తీవ్రమయ్యాయి.
 
ఈ నేపథ్యంలో నష్టాన్ని చవిచూస్తున్న క్యాంటీన్ల ఆదాయం పెంచేందుకు అధికారులు తమ బుర్రలకు పదును పెట్టారు. ఇక నుంచి ఇడ్లీ రూ.3, పొంగల్‌ రూ.7, పెరుగన్నం రూ.5, సాంబారన్నం రూ.7 విక్రయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు నివేదికలు కూడా రూపొందించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే వీటిని అమలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments