Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యం అదుర్స్!

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2014 (10:48 IST)
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, దేశంలోనే వైఫై సౌకర్యం కలిగిన తొలి రైల్వే స్టేషన్‌గా అవతరించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం ఈ రైల్వే స్టేషన్ లో వైఫై సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాక తన మొబైల్‌లో వైఫై సౌకర్యాన్ని ఆయన పరిశీలించారు. ఇకపై చెన్నై రైల్వే స్టేషన్‌కు వచ్చే వారెవరైనా అరగంట పాటు తమ ల్యాప్ టాప్, మొబైళ్లలో ఉచితంగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. 
 
అయితే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యంలో భాగంగా డౌన్ లోడింగ్‌పై ఎలాంటి పరిమితి లేనప్పటికీ, అప్ లోడింగ్‌పై మాత్రం ప్రయాణికులకు అనుమతి లేదు. ఇక 30 నిమిషాల పాటు ఉచితంగానే ఇంటర్నెట్‌ను వాడుకునే ప్రయాణికులు మరింత సమయం నెట్‌లో కొనసాగాలంటే, తమ అకౌంట్ల ద్వారా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments