Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వల్లే భార్య విడాకులిచ్చింది. పరువు నష్టం కడతారా చస్తారా అన్న భర్త

ఫేస్‌బుక్ మెసేజిలు, వాట్సాప్ మేసేజ్‌లు సంసారాలను నిలువునా కూలుస్తున్నాయన్నది తెలిసిన విషయమే. కాని క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదే అని ఆ ఫ్రెంచ్ భర్త లబోదిబోమంటున్నాడు. ఆయన ఏడుపుకు అర్థం ఉంది మరి. భార్య విడాకులిచ్చింది. ప

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (04:08 IST)
ఫేస్‌బుక్ మెసేజిలు, వాట్సాప్ మేసేజ్‌లు సంసారాలను నిలువునా కూలుస్తున్నాయన్నది తెలిసిన విషయమే. కాని క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదే అని ఆ ఫ్రెంచ్ భర్త లబోదిబోమంటున్నాడు. ఆయన ఏడుపుకు అర్థం ఉంది మరి. భార్య విడాకులిచ్చింది. పరువుపోయంది. దీంతో ఈయనకు కడుపు మండింది. ఫలితం పోయిన పరువుకు గాను 335 కోట్ల రూపాయలు కడతారా చస్తారా అంటూ కేసు వేశాడు.  దీని వివరాలు..
 
షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ‍్రెంచి వ్యాపారవేత్త ఒకరులబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు. 
 
అసలు ఏం జరిగిందంటే.. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్ లో ఉన్న యాప్ తో ఓ ఈవెంట్ కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయ్యాడు.
 
అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్ కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్ కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు.
 
ఉబెర్ స్పందన, ఈయన గారి ప్రతి స్పందన ఏమవుతాయన్నది తర్వాత మాట కానీ, మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీ మొబైల్ నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకోండి అంతేగాని ఎంత భార్య అయినా సరే ఆమె ఫోన్ జోలికి వెళ్లవద్దని, వెళ్లినా దాన్నుంచి క్యాబ్ లాంటివి బుక్ చేసుకోవద్దని ఈ ఉదంతం పాఠం చెబుతోంది కదా..
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments