Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో రాణించాలనుకున్నాడు.. నిర్మాత కూతురికి లైనేశాడు.. సీక్రెట్‌గా మ్యారేజ్?!

సినిమా ప్రపంచంలో రాణించాలని కలలు కన్నాడు. ఇక సినిమాల్లో రాణించాలంటే.. అదృష్టం కలిసిరావాలి. లేకుంటే కష్టమే. అయితే సినీ రంగంలో మెప్పు కోసం పాపులారిటీ కోసం ఓ యువకుడు అడ్డదారిన నడిచాడు. యూపీకి చెందిన హన్స

Webdunia
గురువారం, 28 జులై 2016 (12:22 IST)
సినిమా ప్రపంచంలో రాణించాలని కలలు కన్నాడు. ఇక సినిమాల్లో రాణించాలంటే.. అదృష్టం కలిసిరావాలి. లేకుంటే కష్టమే. అయితే సినీ రంగంలో మెప్పు కోసం పాపులారిటీ కోసం ఓ యువకుడు అడ్డదారిన నడిచాడు.

యూపీకి చెందిన హన్సారీ అనే కుర్రాడు తన జీవితంలోని ఆశలను నెరవేర్చుకోవడం కోసం బాలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ కూతురిని ట్రాప్ చేశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి ఊచలు లెక్కబెడుతున్నాడు. 
 
బడా నిర్మాత ఆడిషన్స్‌కు వెళ్లిన హన్సారీ.. అక్కడికొచ్చిన నిర్మాత కూతుర్ని ట్రాప్ చేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి ప్రేమ వ్యవహారంలో అశాంతి రేగింది. సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందామని హన్సారీ బలవంతం చేశాడు. కానీ తండ్రికి చెప్పే చేసుకుందామని అడిగేసరికి ససేమిరా అంది. దీంతో కొద్దిరోజుల పాటు అతనికి దూరమైంది. 
 
అయితే అప్పటి నుంచి సైకోగా మారిన హన్సారీ ఆమెను వేధించడం మొదలెట్టాడు. ఆమె మొబైల్‌కు బెదిరింపు మెసేజ్‌లు, అసభ్యకర ఫోటోలు పంపించేవాడు. ఈ విషయాన్ని యువతి తండ్రితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో హన్సారీని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments