పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:47 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చరణ్జీత్ సింగ చన్నీ పేరును ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం లుథియానాలో జరిగిన ఓ వర్చువల్ ర్యాలీలో రాహుల్ ప్రకటన చేశారు. తద్వారా గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు ఆయన తెరదించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని ఆశిస్తూ వచ్చిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు. 
 
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యధికుల అభిప్రాయం మేరకే ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ పేరును మళ్లీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పంజాబ్‌లో 32 శాతం మేరకు దళిత వర్గానికి చెంది సిక్కుల ఓట్లు ఉన్నాయి. ఇది కూడా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. 
 
కాగా, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్‌కు మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా సీఎం పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకున్నారు. పిమ్మట ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ, ఆయన బీజేపీతో చేతులు కలపకుండా ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments