Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ నిర్మాణ సేన జెండా మార్పు

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (08:49 IST)
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) జెండా మారింది. పూర్తిగా కాషాయ రంగు నేపథ్యంలో నలుపు రంగు అష్టభుజిపై పసుపు రంగు అక్షరాలతో ఉన్న రాజముద్రతో ఈ జెండా కనిపిస్తోంది.

ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో   రాజముద్రను వాడేవారు. అంతకు ముందు ఎంఎన్‌ఎస్‌ జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాకరే గురువారం తన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు.

వీర్‌ సావర్కర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ప్రబోధాంకర్‌ థాకరే, ఛత్రపతి శివాజీల చిత్ర పటాలకు రాజ్‌ థాకరే పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మెగా ర్యాలీని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాకరే జయంతిని ఆ పార్టీ కార్యకర్తలు గురువారం జరుపుకున్నారు.

రాజ్‌ థాకరేకు బాల్‌ థాకరే సమీప బంధువు అన్న సంగతి విదితమే.రాజ్‌ థాకరేతో ఇటీవల బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. దీంతో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలా మంది భావించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments