Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్‌ను బెదిరించి.. నాలుగు నెలల పాటు ఎస్ఐ అత్యాచారం..

రక్షించాల్సిన రక్షకభటుడే ఓ మోడల్‌పై దారుణానికి ఒడిగట్టాడు. మోడల్‌ను బెదిరిస్తూ నాలుగు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (11:21 IST)
రక్షించాల్సిన రక్షకభటుడే ఓ మోడల్‌పై దారుణానికి ఒడిగట్టాడు. మోడల్‌ను బెదిరిస్తూ నాలుగు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి అరాచకాలకు పాల్పడటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే... షామ్ పంజాబీ మూవీ నిర్మాత రాహుల్ తన వద్ద రూ.12 లక్షలు తీసుకొని తన నగ్న చిత్రాలు పంపించమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ముంబయి మోడల్ చండీగఢ్ యుటి పోలీస్ సైబర్ సెల్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్ ఫోగట్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ నవీన్ నిర్మాత రాహుల్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి మోడల్ నగ్నచిత్రాలు తాను తీసుకున్నాడు. 
 
ఆ తరువాత వాటిని చూపించి గత నాలుగు నెలలుగా మోడల్‌ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోడల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్ఐ నవీన్ ఫోగట్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments