Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవింగ్ లైసెన్స్‌‍కు ఆధార్‌కు లింక్... ఆర్సీకి కూడా...

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నకిలీ పాన్ కార్డుల ఏరివేతకు ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను ఏరివేసేందుకు వీలుగా ఆధార్ నంబరు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (15:55 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నకిలీ పాన్ కార్డుల ఏరివేతకు ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను ఏరివేసేందుకు వీలుగా ఆధార్ నంబరుతో లింకు పెట్టనుంది. 
 
ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన చర్చల్లో ఈ అంశం వచ్చిందని త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నామని చెప్పారు. 
 
ఈ అనుసంధానంపై వచ్చే నెలలోనే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిపారు. నకిలీ లైసెన్సులను, ఒకే పేరుపై వివిధ ఆర్టీఏ ఆఫీసుల్లో లైసెన్సులు పొందడాన్ని అరికట్టవచ్చని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై సత్వర చర్యలు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. 
 
డ్రైవింగ్ లైసెన్సులతో పాటు ఆర్సీలను కూడా ఆధార్‌తో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర రవాణాశాఖ దీనిపై ఓ కసరత్తు కూడా మొదలు పెట్టింది. అయితే లైసెన్సుల జారీ అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే అంశం కాబట్టి.. వాటితో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టనుంది. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments