ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ఓ యువతిపై చేయి చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దాడి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని ఫిలిబిత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పర
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ఓ యువతిపై చేయి చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దాడి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని ఫిలిబిత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
ఓ శాడిస్ట్ తనను ప్రేమించాలంటూ ఓ అమ్మాయిని బలవంత పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ శాడిస్ట్, యువతి చెంపపై చేత్తో వరుసగా ఐదు సార్లు బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో యువతి వద్దంటూ వారిస్తున్నా... పట్టించుకోలేదు. ఇంతలో అక్కడకు మరో మహిళ స్కూటర్‌పై రావడంతో అతడు తన దాడిని ఆపేశాడు. ఆ తర్వాత కొట్టినందుకు క్షమించాలంటూ ప్రాధేయపడ్డాడు. కాళ్లు పట్టుకోబోయాడు.
కానీ, అతడి క్రూరత్వాన్ని కళ్లారా చూసిన ఆ యువతి మళ్లీ నిరాకరించింది. స్కూటర్‌పై అక్కడకు వచ్చిన మహిళ ఇదంతా గమనించి దాడికి గురైన బాధితురాలి చేయి పట్టుకుని తన వెంట లోపలికి తీసుకెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డుకావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.