Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకకాలంలో 110 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:24 IST)
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది సీబీఐ. మంగళవారం ఏకకాలంలో 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి హడలెత్తించింది. 30 కేసులకు సంబంధించి 19 రాష్ట్రాల్లో.. 110 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ప్రధానంగా అవినీతి, ఆయుధాల స్మగ్లింగ్ ఆరోపణలపై విసృతంగా గాలించాయి. 

సీబీఐ దాడులతో నేర ప్రవృత్తి కలిగిన వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 110 చోట్ల దాడులు చేయడంతో బిత్తరపోయారు. ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వాల్‌సాడ్, పుణె, పలానీ, గయా, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ ఇతర చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు. 
 
మొత్తం 16 కేసుల్లో మోసపూరిత సొమ్ము రూ.1100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.13 వేలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో నక్కిన నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఉదంతం.. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో మిగతా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని దాడులు చేయిస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments