Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా శారదాస్కామ్: తీగ లాగితే..

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:29 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌స్కామ్‌ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ప్రముఖులు సైతం ఈ కేసులో అరెస్టయ్యారు. 
 
కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న అసోం మాజీ డీజీపీ శంకర్ బారువా తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆయన నివాసంతో పాటు ఆస్తులపై సిబిఐ సోదాలు నిర్వహించింది.
 
పలు బ్యాంకు అకౌంట్లను పరిశీలిచింది. ప్రస్తుతం జైలులో ఉన్న శారదా కంపెనీ అధినేత సుదీప్త సేన్‌ ఫోన్‌ కాల్‌ లిస్టులో ఆయన నెంబర్‌ ఉండడంతో సోదాలు నిర్వహించారు. అవసరమైతే విచారణకు హాజరురకావాల్సి ఉంటుందని సిబిఐ కోరింది. దీంతో నాలుగు రోజులుగా గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ మాజీ డీజీపీ ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
 
మరోవైపు శారదా కుంభకోణంలో సిబిఐ ఇప్పటివరకూ మొత్తం 48 కేసులు నమోదు చేసింది. ఇందులో 44 ఒడిషాలో నమోదు కాగా.. మిగలినవి పశ్చిమబెంగాల్‌లో నమోదయ్యాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments