Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైతే మాకేంటి.. మేం చెబితే వినాల్సిందే.. తమిళులైనా, కన్నడిగులైనా సరే : కావేరి తీర్పుపై సుప్రీంకోర్టు

కావేరి జలాల వివాదంపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్నాటక ప్రభుత్వం వేసిన పిట

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:38 IST)
కావేరి జలాల వివాదంపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్నాటక ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, తీర్పును పునఃసమీక్షించాలని కర్నాటక సర్కారు కోరగా, దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలు కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, తమిళులైనా, కన్నడిగులైనా తామంతట తాము చట్టంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 
 
రెండు రాష్ట్రాలూ చట్టాన్ని గౌరవించాలని, తాము ఎన్నో ఆలోచించే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. అదేసమయంలో ఈ నెల 5న ఇచ్చిన తీర్పును సవరిస్తూ, 15 వేల క్యూసెక్కులకు బదులుగా 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశాలిస్తూ, కావేరీ జలాల వివాదంపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments