Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టిన దండగులు...

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (14:51 IST)
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టిన దండుగలు...  లక్షలాది రూపాయలతో పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూక్కీ జిల్లాలోని ధండేరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మొత్తం నలుగురు దొంగలు ఈ చోరీలో పాలుపంచుకున్నారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఒంటికి దుప్పట్లు చుట్టుకున్న ముగ్గురు దుండగులు ఏటీఎం నుంచి నగదు ఉన్న సంచులతో బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ఉన్న పార్క్ చేసిన తెల్లని స్కార్పియో వాహనంలోని డిక్కీలో ఆ డబ్బు సంచులు పడేసి అందరూ కారెక్కి పరారయ్యారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకు చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఆ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేయడం వల్ల లోపల ఉన్న నగదు కొంత కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments