Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంతో కారు ఢీ.. గాల్లోకి ఎగిరి.. రెప్పపాటులో తల్లి మృతి.. కుమార్తెకు గాయాలు..

రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్ని సూచనలు, జాగ్రత్తలు చేస్తున్నా.. ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. అహ్మదాబాద్‌లో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో మృత్యువు కబలించింద

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (15:44 IST)
రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్ని సూచనలు, జాగ్రత్తలు చేస్తున్నా.. ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. అహ్మదాబాద్‌లో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో మృత్యువు కబలించింది. కుమార్తెతో కలిసి రోడ్డు దాటుతున్న తల్లి క్షణాల్లో మృత్యు ఒడికి చేరుకుంది. 
 
కుమార్తెతో కలిసి రోడ్డు దాటుతుండగా.. అతి వేగంతో వచ్చిన కారు తల్లిని ఢీ కొట్టింది. అతి వేగంగా వచ్చిన కారు తల్లీకూతుళ్లను ఢీకొంది. దాంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరిపడ్డారు. తల్లి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె గాయాలతో బయటపడింది. అంత ప్రమాదం జరిగినా కారు మాత్రం ఆగలేదు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సబ్ వేలను ఉపయోగించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నియంత్రించవచ్చునని.. అయితే అతి వేగంగా కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని.. కారు వేగంగా వెళ్లడంతోనే ఈ ఘోరం జరిగిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments