Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటు బాంబులతో దాడిచేసి.. కత్తులతో నరికి.. బీజేపీ నేత దారుణ హత్య

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (15:32 IST)
పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మంగళం నియోజకవర్గం కార్యదర్శిగా ఉన్న సెంథిల్ కుమార్ (46).. ఆదివారం రాత్రి ఓ బేకరీ వద్ద నిల్చొనివున్న సమయంలో కొందరు వ్యక్తులు బైకులపై వచ్చి తొలుత నాటు బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తులతో నరికి చంపి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
దుండగులు బైకులపై రావడం, నాటు బాంబులతో దాడి చేయడం, మారణాయుధాలతో సెంథిల్ కుమార్‌ను విచక్షణా రహితంగా నరకడం, ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం వంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. 
 
కాగా, సెంథిల్ కుమార్ గత కొంతకాలంగా గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో గంజాయి మాఫియా ముఠానే ఈ దారుణానికి పాల్పడివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేసమయంలో బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ హత్య కేసును సీరియస్‌గా తీసుకుంది. స్థానిక సీఐతో పాటు ఎస్.ఐను కూడా సస్పెండ్ చేసింది. 
 
హంతకులను గుర్తించి, అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణం వల్ల చంపేశారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ నివసించే ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments