Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ చిలువ జింకను మింగేసింది.. పొట్టకు సరిపోక.. మృత్యువాత పడింది..

అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేస

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:33 IST)
అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో 20 అడుగుల పొడవైన కొండచిలువ పెద్ద కృష్ణ జింకను మింగింది. ఆ తర్వాత కదలలేక రోడ్డుపై పక్కన పడి నానా అవస్థలు పడింది. దాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఓ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు.
 
అయితే స్థాయికి మించిన ప్రాణిని అది మింగడంతో జీర్ణించుకోలేక మృత్యువాత పడింది. సాధారణంగా కొండచిలువలు ఏదైనా జంతువును మింగితే అది జీర్ణం కావడానికి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలకుపైగా పట్టవచ్చు. అప్పటి వరకు అవి ఆహారం తీసుకోవు. అలాంటిది జింకను మింగితే కొండచిలువ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జింకను మింగేసిన కొండచిలువ నానా తంటాలు పడి చివరకుడ ప్రాణాలు విడిచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సెకన్ల క్లిప్ కోసం రూ. 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే? ధనుష్‌పై నయన ఫైర్

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments