Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌ను మతంతో ముడిపెట్టొద్దు.. వారు చేసిన నేరం ఏమిటి?: మోడీ ప్రశ్న

ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా ముస్లిం మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మతంతో ముడిపెట్టవద్దని మోడీ వ్యాఖ్యానించారు. మహిళలందరూ తన

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (19:03 IST)
ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా ముస్లిం మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మతంతో ముడిపెట్టవద్దని మోడీ వ్యాఖ్యానించారు. మహిళలందరూ తన సోదరీమణులని, భ్రూణ హత్యల నుంచి తన కుమార్తెల్లాంటి అమ్మాయిల్ని  రక్షించుకోవాలని.. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా సోదరీమణుల జీవితాలు నాశనం కాకూడదన్నారు. వీళ్లలో ఏ ఒక్కరినీ మతంతో ముడిపెట్టి చూడొద్దని మోడీ హితవు పలికారు. 
 
ఇంకా తల్లులు, సోదరీమణుల్ని తప్పక గౌరవించాలన్నారు. ఏ హిందువైనా బాలికల భ్రూణ హత్యలకు పాల్పడితే అతనిని జైలులో పెడతారు. కానీ కేవలం ఫోన్ ద్వారా తలాక్ అని చెప్పినా.. ''నా ముస్లిం సోదరీమణుల జీవితాల్ని ధ్వంసం చేస్తున్నారు. వారు చేసిన నేరం ఏమిటి?'' టీవీ చానెళ్లు దయచేసి తలాక్ విషయాన్ని హిందూ వర్సెస్ ముస్లింల అంశంగా మార్చొద్దు. అలాగే, బీజేపీ వర్సెస్ ఇతర రాజకీయ పార్టీల అంశంగా చూపొద్దు' అని మోడీ అన్నారు. 
 
తలాక్ పద్దతి ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చిందన్నారు. మహిళపై ఎలాంటి అఘాయిత్యాలు జరగొద్దని, మతం ఆధారంగా వివక్ష చూపొద్దని మోడీ తెలిపారు. కొన్ని పార్టీలు ఓట్ల కోసం ఈ 21వ శతాబ్దంలో కూడా మహిళలను వివక్షకు గురిచేస్తున్నారు.. అసలు ఇది ఎలాంటి న్యాయమని మోడీ ప్రశ్నించారు.
 
ఉత్తరప్రదేశ్‌లోని అధికార పార్టీ సమాజ్‌వాదీపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్‌ను ‘ఉత్తమ్‌ ప్రదేశ్‌’గా చేయాల‌నుకుంటే బీజేపీకి ఓటు వేయాల‌న్నారు. 
 
యూపీలోని సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు వేయ‌కుండా తిర‌స్క‌రించాల‌ని కోరారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని అభివృద్ధిని తాను చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. 
 
రాజ్యాంగం ప్రకారం ముస్లిం మహిళలకు న్యాయం జ‌రిగేలా చూడాల్సిన‌ బాధ్యత స‌ర్కారుపై, దేశ ప్రజలపై ఉంటుందని మోడీ అన్నారు. ముస్లిం చట్టాల్లో మార్పుల కోసం విభేదిస్తోన్న వారు చర్చల్లో పాల్గొనాల‌ని అన్నారు. తలాక్ వ్య‌వ‌స్థతో ముస్లిం మహిళల జీవితాలు నాశనం అవుతుంటే తాము ఊరుకోబోమ‌ని చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments