Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా? కాదా? సుప్రీం ఏమంటోంది?

మైనర్‌ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 15 నుంచి 18 యేళ్లలోపు వయస్సు భార్యతో సెక్స్‌ నేరం కాదని ఐపీసీ 375 సెక్షన్‌ చెబుతోంది. అలాగే, 18 య

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (05:19 IST)
మైనర్‌ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 15 నుంచి 18 యేళ్లలోపు వయస్సు భార్యతో సెక్స్‌ నేరం కాదని ఐపీసీ 375 సెక్షన్‌ చెబుతోంది. అలాగే, 18 యేళ్లలోపు బాలికతో బలవంతపు సెక్స్‌ చేస్తే పదేళ్ల వరకు శిక్ష పడేంతటి తీవ్రమైన నేరమని ‘లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) చట్టం’ చెబుతోందని గుర్తు చేసింది. 
 
అంటే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ నోబెల్‌ గ్రహీత, ‘బచ్‌పన్‌ బచావ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్‌ సత్యార్థి వేసిన ప్రజాహిత వ్యాజ్యంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీనిని కేంద్రం పరిశీలించి 4 నెలల్లో తన వాదనను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్.ఖేహార్‌, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
 
అంతేకాకుండా, ఇద్దరు మేజర్లు తదనంతర పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహానికి నిరాకరించిన మాజీ ప్రియుడిపై మహిళా ప్రొఫెసర్‌ పెట్టిన రేప్‌ కేసును కొట్టేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం