Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి అడ్డుకట్ట వేసేందుకు లెఫ్ట్‌తో పొత్తుకు మమత సై : సీపీఎం నిరాకరణ!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (12:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, వామపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు.
 
బీజేపీకి, మోడీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే బీహార్‌లో కాంగ్రెస్, జెడీయు, ఆర్జేడీ చేతులు కలిపాయి. యూపీలో బీఎస్పీతో చేతులు కలిపేందుకు ఎస్పీ మొగ్గు చూపినా మాయావతి నో చెప్పారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ముప్పయ్యేళ్లుగా కమ్యూనిస్టుల పైన పోరాడిన మమతా బెనర్జీ కూడా వారితో పొత్తు కోసం సిద్ధమంటున్నారు. ఇదంతా మోడీ మాయేనని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అంటరానివారు కాదనీ, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకం కాదని అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పొత్తుకు సంబంధించి సీపీఎం నుంచి ప్రతిపాదన వస్తే దానిని పార్టీలో చర్చిస్తామని, తమ పార్టీలో వివిధ స్థాయులు ఉన్నాయని, వాటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనలను లెఫ్ట్ నేతలు తిరస్కరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments