Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో యువతిని కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లైంగిక దాడి

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో క్యాబ్ డ్రైవర్ తన కారులో ప్రయాణించే ఓ యువతిని కిడ్నాప్ చేసి.. ఆపై లైంగికదాడి జరిపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ యువతి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (15:11 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో క్యాబ్ డ్రైవర్ తన కారులో ప్రయాణించే ఓ యువతిని కిడ్నాప్ చేసి.. ఆపై లైంగికదాడి జరిపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ యువతి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని అర్థరాత్రి పూట ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జైపూర్ విశ్మకర్మ ప్రాంతంలో బాధితురాలు మరో ఇద్దరు రూం మేట్లతో కలిసి నగరంలోని ఓ క్లబ్‌లో పార్టీకి వెళ్లింది. పార్టీ ముగుస్తోందనగా ఆ ముగ్గరిలో ఒకరు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. కానీ, ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో క్యాబ్ వివరాలు ఆమెకు రాలేదు. దాంతో క్లబ్ బయటకు వచ్చి క్యాబ్ కోసం చూశారు. ఆ సమయంలో తనను తాను ఉబర్ డ్రైవర్‌గా చెప్పుకొన్న ఓ వ్యక్తి వాళ్ల వద్దకు వచ్చాడు. 
 
యువతులలో ఇద్దరు వెనుక కూర్చోగా, మరో యువతి ముందు సీట్లో కూర్చుంది. తమను మురళీపురా ప్రాంతానికి తీసుకెళ్లమంటే ఎటునుంచో తిప్పి.. చివరకు విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. నర్మద హైవే మీద మిలన్ థియేటర్ సమీపంలో టైరు పంక్చర్ అయిందంటూ పక్కకు ఆపాడు. వెనకాల కూర్చున్న ఇద్దరినీ దిగమన్నాడు. వాళ్లు దిగగానే కారులో ఉన్న మరో యువతితో పరారయ్యాడు. దీనిపై విశ్వకర్మ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం