Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడుకు ముకుతాడు?: 10 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు!

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (08:52 IST)
పది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు ఫలితాలు లభించాయి. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో ఊహించని విజయం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పరిపాలనకు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కాకపోయినప్పటికీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు రావడం గమనార్హం. వచ్చేనెల మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి.
 
గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకుగాను 71 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్‌ మరో రెండు స్థానాల్లో గెలుపొందింది. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ భారీ మెజారిటీ సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, గుజరాత్‌లో 9 మంది, రాజస్థాన్‌లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ, తమ స్థానాలను తిరిగి చేజిక్కించుకోవడంలో అధికార బీజేపీ విఫలమైంది.  

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments