ఉత్తరాఖండ్‌లో ఘోరం.. పెళ్లి బృందం బస్సు బోల్తా - 25 మంది మృతి

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (09:16 IST)
దేవభూమి ఉత్తరాఖండ్‌లో దసరా మహోత్సవం రోజున ఘోరం జరిగింది. పెళ్లి బృందంతో పెళుతున్న బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మృత్యువాపడ్డారు. హరిద్వార్ నుంచి పౌరీ జిల్లాలోని బీర్ఖల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ బస్సు అదుపుతప్పి రోడ్డు బ్యారియర్లను దాటుకుని చెట్టును ఢీకొట్టి లోయలోపడింది. రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో చీకట్లో సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రమాదం వార్త తెలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
ప్రమాదానికి గురైన బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాకుకు వెళుతుండగా, రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలో సిమ్ది గ్రామంలో బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్ళింది. ప్రమాద స్థలంలోనే 25 మంది భావిస్తున్నారు. అయితే, ప్రమాద స్థలంలో ఉన్న అధికారులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడంలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
కాగా, గత యేడాది జూన్ నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో బస్సు ఒకటి 250 మీటర్ల లోతులోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రిధామ్ నుంచి యాత్రికులను తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments