Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఎంపీపై అనర్హత వేటు : ఉత్తర్వులు జారీ చేసిన లోక్‌సభ సచివాలయం

Webdunia
సోమవారం, 1 మే 2023 (22:26 IST)
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజగా కిడ్నాప్‌, హత్య కేసుల్లో నాలుగేళ్లు శిక్షపడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
'నాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో ఘజియాపూర్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్జల్‌ అన్సారీ ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. 29వ తేదీ ఏప్రిల్‌ 2023 నుంచి ఇది వర్తిస్తుంది' అని లోక్‌సభ సెక్రెటేరియేట్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
 
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అన్సారీకి అక్కడి ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం 4 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అతడి సోదరుడు ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కిడ్నాప్‌, హత్య ఘటనల్లో గ్యాంగ్‌స్టర్‌ నిరోధక చట్టం కింద అన్సారీ సోదరులపై 2007లో  కేసు నమోదైంది. 
 
ఈ కేసుపై విచారణ జరిపిన ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. 1996లో విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు నందకిశోర్‌ కిడ్నాప్‌ వ్యవహారం, 2005లో భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసుల్లో ముక్తార్‌ అన్సారీ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో 2007లో అతడిపై కేసు నమోదైంది. ఆ
 
తర్వాత ఇదే అభియోగాలపై ముక్తార్‌ అన్న అఫ్జల్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో వీరిద్దరి దోషులుగా తేల్చుతూ యూపీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా, అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments