Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో విషాదం : విషం తిని బీఎస్పీ నేత ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (10:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. యూపీలోని బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఎస్పీ మాజీ అధ్యక్షుడు హర్‌వీర్(30) తహసీల్ పరిసరాల్లో విషాహారం తిన్నాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతి చెందాడు. 
 
తన భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు వచ్చిన హర్‌వీర్‌ను సోమవారం రావాలని ఎస్డీఎం చెప్పారు. ఈ నేపధ్యంలో హర్‌వీర్ ఎస్డీఎంతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలోనే హర్‌వీర్ విషాహారం తిన్నాడు. ఈ ఉదంతంపై విచారణకు డీఎం ఆదేశించారు. 
 
మరోవైపు పోలీసులు హర్‌వీర్ మృతదేహాన్ని పోస్టుమారం కోసం తరలించారు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితమే ఈ భూమి పట్టా హర్‌వీర్ పేరిట నమోదైవుంది. ఇప్పుడు దానిని క్రమబద్ధీకరించుకునేందుకు హర్‌వీర్ దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ ఫైలు తహసీల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో హర్‌వీర్ ఎస్డీఎం‌ను కలుసుకుని, తన సమస్య విన్నవించుకున్నాడు. అయితే ఎస్డీఎం అతనితో సోమవారం రావాలని చెప్పారు. దీంతో కలత చెందిన హర్‌వీర్ విషాహారం తీసుకున్నాడు. 
 
దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే దారిలోనే హర్‌వీర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments