Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్తుండగా కుమారుడిని అడ్డుకున్నాడు.. లెక్కలు చెప్పమన్నాడు.. చివరికి?

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (10:58 IST)
క్షణికావేశాలు నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా శోభనం గదికి వెళ్తుండగా.. తండ్రి పెళ్లి లెక్కలు అడిగాడనే కోపంతో.. కన్నతండ్రినే ఆ కుమారుడు కడతేర్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పెళ్లి జరిగిన రోజు రాత్రి... శోభనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే శోభనం గదికి వెళ్తుండగా.. కుమారుడిని అడ్డుకుని.. పెళ్లికి వచ్చిన చదివింపుల వివరాలను చెప్పాలని డిమాండ్ చేసిన తండ్రిని.. తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు హతమార్చాడు. 
 
ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం సమీపంలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదిచ్చనల్లూరుకు చెందిన షణ్ముగం (48) కుమారుడు ఇళమది (23)కి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో బంధువులంతా వెళ్లిపోగా, పెళ్లి ఖర్చు లెక్కలు చెప్పాలని, చదివింపుల డబ్బులు తేవాలని షణ్ముగం కోరాడు. 
 
అప్పటికే తన భార్య శోభనపు గదికి వెళ్లగా, తానూ వెళ్లాలన్న ఆత్రుతతో వున్నాడు. ఇంకా చదివింపుల లెక్కలు రేపు చూసుకుందామని చెప్పాడు. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. దీంతో తండ్రీకుమారుల మధ్య వాగ్వివాదం జరిగింది. అందుబాటులో ఉన్న దుడ్డుకర్రతో కొడుకుపై షణ్ముగం దాడికి ప్రయత్నించడంతో, దాన్నే లాక్కున్న ఇళమది, తండ్రి తలపై బలంగా మోదాడు. 
 
దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. బంధుమిత్రులు ఆసుపత్రికి తరలించారు. ఇంతలో చికిత్స పొందుతూ షణ్ముగం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇళమదిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments