Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్య.. కారణం అదే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:38 IST)
పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని వేలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వేలూరు సమీప గ్రామానికి చెందిన యువతికి కాట్పాడికి చెందిన బాలాజీ అనే యువకుడితో ఆగస్టు 23వ తేదీన వివాహం ఘనంగా జరిగింది. ఇక నూతన దంపతుల కోసం విందు ఏర్పాటు చేయగా మూడు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లారు ఈ కొత్త జంట.
 
కాగా ఆదివారం రాత్రి ఇంటి మేడపై ఒంటరిగా వుండిన నవవధువు గదిలోంచి కేకలు వినిపించాయి. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా... నవవధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది.
 
ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత కాసేపటికి చికిత్స పొందుతూ ఆ యువతి కన్నుమూసింది. 
 
ఇక ఆ గదిలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళి కట్టిన రోజు నుంచి భర్త అనుమానంతో వేధిస్తున్నాడని ఎవరితో మాట్లాడిన సూటిపోటి మాటలు అంటూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడని అందులో రాసివుంది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments