Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పగింతలు.. అతిగా ఏడ్చిన వధువు.. గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:55 IST)
పెళ్లి వైభవంగా ముగిసింది. కానీ అప్పగింతలే ఆ వధువుకు ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే సర్దుకు పోవాలంటూ.. అప్పగిస్తుంటారు. 
 
ఇక సున్నితమైన మనస్కులు వారైతే.. ఏడుస్తూ…కుప్పకూలిపోతుంటారు. ఇలాగే ఓ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ.. వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడి తో వివాహం జరిగింది. మరుసటి రోజు..అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరపగా..ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు.
 
నీరసం వల్లే సృహ కోల్పోయిందని భావించామని..ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments