Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు గుట్కా నమిలాడు... ఒంటికాలిపై నిలబడి.. పెళ్ళి రద్దు చేసుకున్న వధువు.. ఎక్కడ?

వరుడు పెళ్ళి రోజున కూడా గుట్కా నములుతూ అందరినీ పలకరించాడనే కారణంతో వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన యూపీలోని బలియా జిల్లా మురార్ పట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మురార్ పట్టే ప్రాంత

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:19 IST)
వరుడు పెళ్ళి రోజున కూడా గుట్కా నములుతూ అందరినీ పలకరించాడనే కారణంతో వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన యూపీలోని బలియా జిల్లా మురార్ పట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మురార్ పట్టే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతికి బాలాసింగ్ అనే వ్యక్తితో నిశ్చయమైంది. మంగళవారం రాత్రి బాలాసింగ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మురార్ పట్టేప్రాంతానికి పెళ్లికోసం చేరుకున్నారు.
 
వధువు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదిక మీదకు బాలాసింగ్ వెళ్లాడు. వధువు సైతం వరుడు బాలాసింగ్ పక్కన వచ్చి నిలబడింది. ఆ సందర్భంలో బాలాసింగ్ నోటి నిండా గుట్కా వేసుకుని దర్శనం ఇచ్చాడు. అదే నోటితో అందరినీ పలకరిస్తున్నాడు. దీన్ని గమనించిన వధువు.. నీవు గుట్కా  వేసుకుంటావా? అని అడిగింది. అందుకు వరుడు అవునని సమాధానం ఇచ్చాడు. 
 
అంతే వధువుకు మండిపోయింది. గుట్కాలు తినే వ్యక్తిని, మందు తాగే మనిషిని నేను వివాహం చేసుకోనని చెప్పి రిసెప్షన్ వేదిక మీద నుంచి కిందకు దిగేసింది. పెద్దలు నచ్చచెప్పినా ఆమె మాట వినలేదు. తాను గుట్కా తినడం మానేస్తానని వరుడు కూడా హామీ ఇచ్చాడు. అయినా ఒంటికాలిపై నిలబడిన వధువు పెళ్ళి రద్దు చేసుకుంది. ఎవ్వరూ చెప్పినా, పంచాయతీ పెట్టినా, పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. చివరికి వరుడు గుట్కా నములుతూ సొంతూరికి వెళ్ళిపోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments