Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని ఓ హత్య కేసులో దోషులుగా హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. అక్టోబర్ 12న వారికి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. 
 
వివరాల్లోకెళ్తే.. 2002లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. దాంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. రామ్ రహీమ్ సింగ్ తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ లను దోషులుగా తేల్చింది. అయితే నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ఇక జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో ఇప్పటికే డేరా బాబా శిక్ష అనుభవిస్తూ సునారియా జైలులో ఉన్నారు. 
 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments