Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు ఇంట్లో వున్నాడు..పేరెంట్స్ వచ్చేశారు..వార్డ్‌బోర్డ్‌లో దాచేద్దాం!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (16:36 IST)
ప్రియుడు ఇంట్లో ఉన్నాడు.. పేరెంట్స్ వచ్చేశారు.. ఆ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది.. తెలుసుకోవాలా..? ఈ స్టోరీ చదవండి. ఒకవైపు అరాచకాలు, అత్యాచారాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. ప్రేమ పేరిట యువతీయువకులు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇంట్లో అమ్మా నాన్న ఎవరూ లేకపోవడంతో తన ప్రియుడిని ఓ యువతి కాల్ చేసి ఇంటికి రమ్మంది. అయితే చెప్పిన  చెప్పిన సమయం కంటే కాస్త ముందే తల్లిదండ్రులు వచ్చేయడంతో ఆ యువతికి చుక్కెదురైంది. 
 
ఇంటికి రమ్మన్న ప్రియుణ్ణి తల్లిదండ్రులు రావడంతో వార్డ్ రోబ్‌లో దాచేసింది. కాసేపు ఎలాగో నెట్టుకొచ్చిన అతగాడు, కాలం గడిచేకొద్దీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. 'ఎంతసేపు ఇలా' అంటూ ప్రేయసికి ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపాడు. ఫలితం లేకపోవడంతో, వెంటనే వార్డ్ రోబ్ లోంచి దభీమని దూకేశాడు. ఈ అనుకోని అతిథిని చూసి ఆ యువతి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తేరుకుని అతగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
 
ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. స్మిత, రాహుల్ ప్రేమికులు. ఓ రోజు స్మిత తల్లిదండ్రులు ఊరెళ్ళారు. దీంతో, సాయంత్రం వరకు ఊసులాడుకోవచ్చని స్మిత, రాహుల్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలోనే సీన్ అడ్డం తిరిగింది. తల్లిదండ్రులు ఓ రోజు ముందుగానే రావడం, రాహుల్ దొరికిపోవడం జరిగాయి. తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ స్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాహుల్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments