Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఎవరూ లేరని రమ్మంది.. వార్డ్‌రోబ్‌లో దాచేసింది!

Webdunia
శనివారం, 26 జులై 2014 (14:34 IST)
దేశంలో ఒకవైపు అరాచకాలు, అత్యాచారాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. ప్రేమ పేరిట యువతీయువకులు యమా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇంట్లో అమ్మా నాన్న ఎవరూ లేకపోవడంతో తన ప్రియుడిని ఓ యువతి కాల్ చేసి ఇంటికి రమ్మంది. అయితే చెప్పిన  చెప్పిన సమయం కంటే కాస్త ముందే తల్లిదండ్రులు వచ్చేయడంతో ఆ యువతికి చుక్కెదురైంది. 
 
ఇంటికి రమ్మన్న ప్రియుణ్ణి తల్లిదండ్రులు రావడంతో వార్డ్ రోబ్‌లో దాచేసింది. కాసేపు ఎలాగో నెట్టుకొచ్చిన అతగాడు, కాలం గడిచేకొద్దీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. 'ఎంతసేపు ఇలా' అంటూ ప్రేయసికి ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపాడు. ఫలితం లేకపోవడంతో, వెంటనే వార్డ్ రోబ్ లోంచి దభీమని దూకేశాడు. ఈ అనుకోని అతిథిని చూసి ఆ యువతి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తేరుకుని అతగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
 
ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. స్మిత, రాహుల్ ప్రేమికులు. ఓ రోజు స్మిత తల్లిదండ్రులు ఊరెళ్ళారు. దీంతో, సాయంత్రం వరకు ఊసులాడుకోవచ్చని స్మిత, రాహుల్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలోనే సీన్ అడ్డం తిరిగింది. తల్లిదండ్రులు ఓ రోజు ముందుగానే రావడం, రాహుల్ దొరికిపోవడం జరిగాయి. తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ స్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాహుల్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments