Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు కత్తిరించేటప్పుడు స్పృహ కోల్పోతున్నాం.. రక్షించండి..

హర్యానాలో వున్న ఓ గ్రామంలో మహిళల జుట్టు చోరీకి గురవుతున్నాయి. మర్మమైన రీతిలో మహిళల జుట్టును కత్తిరించుకుంటున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఏ కారణం చేత మహిళల జుట్టును కత్తిరిస్తున్నారు.

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (14:16 IST)
హర్యానాలో వున్న ఓ గ్రామంలో మహిళల జుట్టు చోరీకి గురవుతున్నాయి. మర్మమైన రీతిలో మహిళల జుట్టును కత్తిరించుకుంటున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఏ కారణం చేత మహిళల జుట్టును కత్తిరిస్తున్నారు.. ఎవరు ఈ పని చేస్తున్నారో.. అనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు 15కి మించిన మహిళల జుట్టును ఆచూకీ తెలియని వ్యక్తులు కత్తిరించుకుని వెళ్ళిపోయారు.
 
అంతేగాకుండా.. జుట్టు కత్తిరించే సమయంలో స్పృహ కోల్పోతున్నట్లు బాధిత మహిళలు వాపోతున్నారు. తమ జుట్టును పిల్లి శూన్యం వంటి చేతబడులకు ఉపయోగిస్తారేమోనని బాధిత మహిళలు భయపడుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వెరైటీ కేసుతో పోలీసులు తలపట్టుకున్నారు. మహిళల జుట్టును కత్తిరించే వ్యక్తులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
కేవలం హర్యానాలోనే కాకుండా ఢిల్లీ, గూర్గాన్ ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. నలుపు రంగు దుస్తుల్లో వచ్చి తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని, ఆ సమయంలో తాము స్పృహ కోల్పోతున్నట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments