Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియురాలి ఇంటికి బాంబు పార్శిల్ బాంబు - భర్త, కుమార్తె మృతి

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (17:56 IST)
తన మాజీ ప్రియురాలైన వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు ఓ పార్శిల్ బాంబును పంపించాడు. ఈ బాంబు పేలడంతో ఆ మహిళ భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడాలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబంతో సహా వడాలిలో నివసిస్తూ కూలి పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. గురువారం వారి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్‌ రావడంతో దానిని తీసుకున్న జీతూభాయ్, అతని కుమార్తె భూమిక(12) ఆన్‌ చేయడానికి ప్రయత్నించగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇంటికి ప్యాకేజీని డెలివరీ చేసిన రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజారా (31) ను అరెస్టు చేశామన్నారు. అతడు రాజస్థాన్‌కు వెళ్లి బాంబు తయారీకి అవసరమైన పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. టేప్‌ రికార్డర్‌ ప్లగ్‌ ఆన్‌ చేసిన వెంటనే అది పేలేలా బాంబును రూపొందించాడని వారు పేర్కొన్నారు. తన ప్రియురాలిని జీతూభాయ్‌ వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నానని నిందితుడు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments