ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయభేరీపై బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇది ఓటింగ్ మిషన్ల మాయాజాలమన్న
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయభేరీపై బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇది ఓటింగ్ మిషన్ల మాయాజాలమన్నారు. తమ ఓట్లన్నీ బీజేపీకే పడేలా ఈవీఎంలను తయారు చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిన మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. ముస్లిం ప్రాంతాల్లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బీజేపీ కేవలం 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారంలోకి వచ్చిన బీఎస్పీ.. ఇపుడు వరుసగా రెండోసారి అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.